బంగ్లాదేశ్లో హిందువులనే లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు వారి ప్రాణాలను తీస్తున్నాయి. ఈ దారుణ ఘటనలు హిందూ సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి. నేపాల్ వంటి చిన్న దేశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి బంగ్లాకు వ్యతిరేకంగా ధర్నాలు చేపడుతున్నారు. అయితే, భారత్లో కనీస స్పందన కనిపించడం లేదు. హిందువుల హత్యలను భారత ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని పలువురు పిలుపునిస్తున్నారు.