SKLM: ఢిల్లీలో చోటుచేసుకున్న పేలుళ్ల ఘటన నేపథ్యంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్(ఆమదాలవలస)లో మంగళవారం భద్రతా తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఆర్పీఎఫ్ ఎస్సై అరుణ, జీఆర్పీ ఎస్సై మధుసూదనరావు ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందం ప్రయాణికుల లగేజీలు, ప్లాట్ఫాం, వేచి గదులను తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.