SKLM: జి. సిగడాం మండలం సంత ఉరిటిలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి కె .శ్రీనివాస్ రావు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 1,000 మంది రైతులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అని ఆశాభావం వ్యక్తం చేశారు.