అన్నమయ్య: మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్విర్యం చేసి రాష్ట్రలపై 40% భారం మోపడం ఏంటని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత కరువు జిల్లాగా ఉన్న అనంతపురంలో 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించిందని రాయచోటిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు.