SRD: క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగనున్న 72వ సీనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న సంగారెడ్డి జిల్లా పురుషుల, మహిళల జట్టుకు 30 వేల రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన జెర్సీలను అందజేశారు.