AP: తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన శ్రీవారి లడ్డూ ప్రసాద కౌంటర్లను పరిశీలించారు. అక్కడ సిబ్బంది పనితీరును పర్యవేక్షించడంతో పాటు, లడ్డూల బరువును స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం భక్తులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.