VSP: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించినప్పుడే ప్రశాంతమైన జీవనం సాధ్యమని శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. భీమిలి బీచ్ రోడ్డులోని పీఠం ఆవరణలో గురువారం నిర్వహించిన 24వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికతను కృత్రిమ మేధాశక్తితో సమన్వయం చేస్తే మానసిక ధైర్యం పెరుగుతుందన్నారు.