ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సీరియస్‌గా సాగుతోంది. నిందితుడు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ఇవాళ్టితో ప్రభాకర్ రావు కస్టడీ ముగియడంతో ఆయన వాంగ్మూలం రికార్డ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌ను కూడా సిట్ విచారించింది. ట్యాపింగ్ వల్లే ఆ వ్యవహారం బయటపడటంతో.. ఆ లింకులపై కూపీ లాగుతున్నారు.