GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని బసవ మందిర భూమిని ఇతర సంస్థలకు కట్టబెట్టవద్దని జంగమ కులస్తులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను గురువారం కోరారు. కొల్లిపర మండల పర్యటనలో ఉన్న ఆయనకు వారు వినతిపత్రం అందజేశారు. పూర్వం విరాళంగా ఇచ్చిన ఈ స్థలాన్ని, దేవాదాయ శాఖ ప్రస్తుతం వేరే సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని చూడటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.