VZM: వంగర మండలం కొట్టిశ గ్రామంలో సంఘం పెద్దల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వంగర ఎంపీపీ, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సురేష్ ముఖర్జీ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ శాంతి, త్యాగం, కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు. కుల, మత భేదాలు లేకుండా పరస్పర గౌరవంతో జీవించాలన్నారు.