PDPL: బీజేపీ వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్‌గా సుల్తానాబాద్‌కు చెందిన ఎల్లంకి రాజన్న నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి నియామక పత్రాన్ని రాజన్నకు అందించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. మూడున్నర దశాబ్దాలుగా తాను పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి పదవికి ఎంపిక చేసిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.