గుంటూరులో ఎన్టీఆర్ అభిమానులు అరుదైన రికార్డు సృష్టించారు. పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 ఏళ్లుగా ప్రతి గురువారం బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్నారు. నేటితో ఈ కార్యక్రమం 25 వసంతాలు పూర్తి చేసుకోగా, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. 1969లో ఏర్పాటైన సంఘం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపింది.