‘సైక్ సిద్ధార్థ’ ప్రమోషన్స్‌లో నటుడు నందు ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తాను చేయని పనికి తన మీద ఆరోపణలు వచ్చాయన్నాడు. ఆ సమయంలో తనతో పాటు కుటుంబం మొత్తం బాధపడిందని తెలిపాడు. అప్పుడు గీత తనతో ‘ఇక్కడ ఉండలేం.. అనీ వదిలేసి వేరే దేశానికి వెళ్లిపోయి హోటల్లో పని చేసుకుందామని చెప్పిందని, అవి గుర్తుచేసుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవని అన్నాడు.