నటుడు శివాజీ కాంట్రవర్సీపై అనసూయ SMలో పోస్టులు పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాను ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని బలంగా చెబుతానని పోస్ట్ పెట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి సమాజంలో పట్టించుకోని అంశంపై పోరాటం చేయడం తన ఉద్దేశమని, ఎన్ని జరిగినా తాను చెప్పిన దానిపై కట్టుబడి ఉంటానని పేర్కొంది. మీరు అలా అసూయపడుతూనే ఉండండని.. తాము మరింత శక్తివంతంగా, ఆకర్షణీయంగా ముందుకుసాగుతామని తెలిపింది.