TG: న్యూ ఇయర్ జోష్లో ఉన్నారా? అయితే జాగ్రత్త. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. బుధవారం నుంచే తనిఖీలు మొదలయ్యాయి. డిసెంబర్ 31 వరకు ఈ చెకింగ్స్ ఉంటాయని పోలీసులు చెప్పారు. ఫస్ట్ డేనే 304 మంది తాగి బండి నడుపుతూ దొరికిపోయారు. పార్టీ పేరుతో తాగేసి రోడ్డెక్కితే గ్యారెంటీగా కేసులు నమోదవుతాయి.