SDPT: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా సిద్దిపేట BJP పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్ నివాళులు అర్పించారు. గురువారం జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి వాజపేయి చిత్రపటానికి పూలమాల వేశారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం జీవించిన మహా వ్యక్తి వాజపేయి అని కీర్తించారు. ఆయన సేవలను కొనియాడారు.