TG: హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి(D) తెల్లాపూర్ పరిధిలోని జ్యోతిబాపూలే కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తల్లి, కుమారుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితుడు తన గొంతు తానే కోసుకున్నాడు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ జంట హత్యలతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.