KMM: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రేపు కొణిజర్ల, సింగరేణి మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.