KDP: భాగవతం చెప్పే కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు తులసి రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఎర్రగుంట్ల మండలంలోని, చిలమకురు భైరవ నరసింహ స్వామి దేవాలయంలో జరుగుతున్న భాగవత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భాగవతం, భారతం, రామాయణం కావ్యాలను ప్రతి ఒక్కరు చదవాలని, భాగవతం వింటే మహావిష్ణువు అనుగ్రహంతో మోక్షం వస్తుందని అన్నారు.