KMR: మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బాధితులు పోగొట్టుకున్న 112 మొబైళ్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారిందన్నారు. అందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు వంటి కీలకమైన డేటా ఉంటుందన్నారు.