NLR: చేజర్ల మండలం నాగులవెల్లటూరు సమీపంలో కారు చెట్టును ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. పెంచలకోనకు నుంచి తిరిగి కలువాయి వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బ్యాగులు వెంటనే ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.