WGL: పక్షులు, ప్రజలకు ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. సంక్రాంతి నేపథ్యంలో చైనా మాంజా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, కుమార్‌పల్లిలో రూ. 2 లక్షలకుపైగా విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.