సత్యసాయి: హిందూపురం పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పెనుకొండ పట్టణం దర్గాపేటకు చెందిన ఎనిమిదవ వార్డు ఇంఛార్జ్ షఫీక్ భార్య S.షాబీరా భానుకు స్థానం కల్పించారు. ఈ సందర్భంగా గురువారం పెనుకొండలో మంత్రి సవితను ఆమె కలిశారు. జిల్లా కమిటీలో మైనారిటీలకు చోటు కల్పించినందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.