BHPL: గోరికొత్తపల్లి (M) నిజాంపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీ మెయిన్ సెంటర్ వద్ద విద్యుత్ లైట్లు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బోర్ మోటార్ వద్దకు త్రాగునీరు కోసం వచ్చే కాలనీ మహిళలు లైట్లు లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. నూతన సర్పంచ్, వార్డు మెంబర్ స్పందించి వెంటనే విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.