VZM: బాడంగి మండలం ముగడ గ్రామంలో బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మాతృమూర్తి సత్యవతి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఆయన నివాసానికి వెళ్ళి, ఆమె చిత్రపటానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.