SKLM: పొందూరు పట్టణంలో క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, త్యాగం, మానవత్వాన్ని చాటిచెప్పే మహత్తర పండుగ అని పేర్కొన్నారు.