‘బాక్సింగ్ డే’ అనేది ప్రతి ఏటా క్రిస్మస్ మరుసటి రోజున, అంటే డిసెంబర్ 26న జరుపుకునే ఒక సంప్రదాయ దినం. పూర్వ కాలంలో చర్చిలలో ఉంచిన విరాళాల పెట్టెలను(Boxes) తెరిచి, అందులోని నగదును లేదా బహుమతులను పేదలకు పంపిణీ చేసేవారు. అందుకే ఈ రోజుకు ‘బాక్సింగ్ డే’ అనే పేరు వచ్చింది. అలాగే, ధనవంతులు తమ వద్ద పనిచేసే సేవకులకు క్రిస్మస్ మరుసటి రోజున బహుమతులు అందజేసి, వారికి సెలవు ఇచ్చేవారు.