WNP: బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ.. వీటి స్థానంలోనే వీబీజీ రాంజీ బిల్లును తీసుకువచ్చి వ్యవసాయ కార్మికులను అన్యాయం చేస్తుందని వ్యవసా కార్మిక సంఘం కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారు ఘణపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ పేరునే కొనసాగించాలని కోరారు.