VKB: పూడూరు మండలం చన్ గోముల్ గ్రామంలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి. రైతులు, మూగజీవాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున మొక్కలను వెంటనే తొలగించాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.