BDK: ఏవీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నూప నాగేశ్వరావు ఆదేశాల మేరకు ఈరోజు చర్ల మండల కేంద్రంలో ఏవీఎస్పీ విజయరామ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఏవీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ.. ఏజెన్సీ మండలాల్లో పనిచేస్తున్న అధికారుల వలన ఆదివాసిలకు అందవలసిన హక్కులు హరించి పోతున్నాయని మండి పడ్డారు. ఆదివాసులకు దక్కవలసిన ఫలాలు దక్కడం లేదని వాపోయారు.