AP: శ్రీవారి భక్తులతో తిరుమల కిక్కిరిసిపోయింది. వరుస సెలవులతో రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యూలైన్లలోకి భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం క్యూలైన్లు అన్నీ నిండిపోగా.. దర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతోంది. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు మాత్రమే భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.