విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమింపబడ్డ చోడే పట్టాభిరామ్ గురువారం మాధవధారలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అందరి నేతలను కలుపుకుంటూ పార్టీ పటిష్టతకు పాటుపడతానన్నారు. రాష్ట్రంలో విశాఖ ఆర్థిక రాజధానిగా తయారవుతుందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు.