VSP: రుషికొండ భవనాలు వినియోగంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీచ్ రోడ్లోని వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ భవనాలకు సంబంధించి మంత్రుల కమిటీ వేశారని వారు ఎవరితో మాట్లాడారని అన్నారు. మా అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయాలు ప్రకటిస్తే ఎలా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.