NTR: కొండపల్లికి చెందిన టీడీపీ సీనియర్ మైనార్టీ నేత మొహమ్మద్ జైనుల్ అబేద్దీన్ (అలియాస్ అఫ్సర్)ను ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పార్టీ అధిష్టానం గురువారం నియమించింది. మొదటి నుంచీ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, పార్టీ బలోపేతానికి అఫ్సర్ నిబద్ధతతో సేవలందించారు. గతంలో ఈయన జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.