NLR: గ్రామంలో ఉంటే కొడతారు కొద్ది రోజులు గ్రామంలో ఉండకుండా వెళ్లిపో అని ఇందుకూరుపేట SI నాగార్జున రెడ్డి అంటున్నాడని బాధితుడు రమేశ్ పేర్కొన్నాడు. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులకు, SI న్యాయం చేయడం లేదని ఈనెల 15వ తేదీన SP గ్రీవెన్స్ డేలో అర్జీ ఇచ్చానని అన్నారు. అందుకు SI తనపై కక్షకి పూనుకున్నారని గురువారం నెల్లూరులో మీడియా ముందు వాపోయారు.