JGL: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. గురువారం పట్టణంలోని 21వ వార్డులో సయ్యద్ ఖదీర్ హల్గిరి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రొసీడింగ్ పత్రాలు పొందిన వారు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.