MBNR: ప్రతి సంవత్సరం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ అయ్యప్ప కొండపై నిర్వహించే అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం గురువారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తోపాటు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి కృప ప్రజలపై ఉండాలన్నారు.