వరుస సెలవులు రావడంతో ప్రజలు అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ‘గోవిందా’ నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగుతుంటే.. భక్తుల రద్దీతో యాదాద్రి, విజయవాడ, శ్రీశైలం, సింహాచలం ఆలయాలు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.