NRML: అడవుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. చందారం గ్రామంలో అటవీ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, అక్రమ నరుకు, అగ్నిప్రమాదాలు వంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్బీవో రాజు, మాజీ వీఎస్ఎస్ ఛైర్మన్ రవి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.