కోనసీమ: అమలాపురం మోబర్లీపేట సబ్ పోస్ట్ ఆఫీస్ పనివేళలను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ కె.కృష్ణ గురువారం తెలిపారు. గతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉన్న కౌంటర్ బుకింగ్ సేవలను, ఇకపై ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.