ATP: అనంతపురం కమలనగర్కు చెందిన జనార్దన్, సుధాకర్ ఇద్దరూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇద్దరూ కలిసి తమ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో జనార్దన్ తన స్నేహితుడు సుధాకర్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.