KDP: జమ్మలమడుగు పట్టణ పరిధిలో వాహనాలను CI నరేశ్ బాబు గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ నరేశ్ బాబు మాట్లాడుతూ.. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వవద్దని, అలాగే సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్డుపై వాహనాలు నడిపిస్తే సీజ్ చేస్తామని తెలిపారు.