ASR: పాడేరు డివిజన్ పరిధిలోని 132కేవీ ఎండపల్లి వలస సబ్ స్టేషన్లో ఫీడర్ల మరమ్మతులు చేపడుతున్నందున ఈ నెల 27వ తేదీ శనివారం నుంచి 31వ తేదీ బుధవారం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీ.వేణుగోపాల్ గురువారం తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.