కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్సీ వీ.వీ.వీ. చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.