ప్రకాశం: చీమకుర్తిలోని క్రిస్టియన్స్ పాలెం వద్ద పేకాట ఆడుతున్న 11 మందిని ఎస్సై కృష్ణ పోలీసు సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3,060లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ఎవరైనా పేకాట శిబిరాలను ప్రోత్సహించినా, పేకాట ఆడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.