SKLM: ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో శుక్రవారం ఉదయం ధనుర్మాసం పురస్కరించుకుని భక్తులు, యువత భక్తిశ్రద్ధలతో మేలుకొలుపు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ వీధుల్లో, భక్తి గీతాలు పాడుతూ, భజనలు చేస్తూ భగవన్నామస్మరణ చేశారు. చల్లని వాతావరణాన్ని లెక్కచేయకుండా యువత ఉత్సాహంగా భజనలలో పాల్గొన్నారు.