PPM: బలిజిపేట మండలంలో ‘అక్షరాంధ్ర – ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా రాత్రి బడులు జోరుగా సాగుతున్నాయి. గురువారం రాత్రి పెదపెంకి గ్రామంలో నిరక్షరాస్యులైన మహిళా సంఘాలు సభ్యులుకు రాయడం, చదవడంతో పాటు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి 10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ను నియమించామని వెలుగు ఏపీఎం రామకృష్ణ తెలిపారు.