వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోన్న మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘కొన్నేళ్లుగా దక్షిణాదిలో, బాలీవుడ్లో మంచి అవకాశాలను అందుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటా. అయితే దక్షిణాది చిత్రాల్లో నటించడమనేది నా ప్రణాళికలో లేదు. ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ అవకాశాన్ని ఒక వరంలా భావిస్తాను’ అని పేర్కొంది.