NLR: సైదాపురం మండల పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో గురువారం కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 3320 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కాంతికుమార్ తెలిపారు. కోడిపందేలు పేకాట వంటి అవాంఛనీయ సంఘటనలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.