MBNR: దుకాణంలో దొరికే యూరియాకు మీరు యాప్ పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి మీ మంత్రులు, ఎమ్మెల్యేలను యాప్ ద్వారా యూరియా బుక్ చేయమను ఎంత మందికి బుక్ చేయడం వస్తుందో చూద్దాం అంటూ సవాల్ విసిరారు.